గులాబీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర బుధవారం తెలంగాణ భవన్ నుండి ప్రారంభం అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటిమి తర్వాత కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి వళ్తున్నారు. 17రోజుల పాటు ఆయన బస్సు యాత్ర కొనసాగనుంది. మిర్యాలగూడలో ప్రారంభమైన బస్సుయాత్ర మే 10వ తేదీన సిద్దిపేటలో ముగియనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం ఎదుర్కొంటున్న సమ స్యలపై ప్రత్యేకంగా కేసీఆర్ తెలుసుకోనున్నారు. అలాగే కాంగ్రెస పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. 17 రోజుల పాటు సాగే యాత్రలో రైతులు, వివిధ వర్గాల ప్రజలు, మహిళలను కలిసి, వారి సమస్యలను తెలుసుకోనున్నారు. రాష్ట్రంలో మెజారిటీ సీట్లు గెలుచుకునేలా ఈ యాత్రద్వారా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.