వినాయక చవితి సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ శిగుల్ల రాజు రాష్ట్రప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్దికి, జ్ణానానికి ఆరాధ్యుడిగా.. ఆటంకాలను తొలిగించే విఘ్నేశ్వరుడిగా.. భక్తి శ్రద్దలతో మనం జరుపుకునే పండుగ గణపతి నవరాత్రులు అని అన్నారు. ఈ నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా, ఆనందంతో జరుపుకోవాలని ఆయన కోరారు. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా, సుఖశాంతులతో జీవించేలా, ప్రజలందరికీ ఆ ఏకదంతుని దీవెనలు ఎల్లవేలలా ఉండాలని శిగుల్ల రాజు ప్రార్థించారు.