బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా హైదరాబాద్ జర్నలిస్ట్ లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు. మెదక్ పార్లమెంట్ స్థానానికి సీనియర్ జర్నలిస్ట్ మారేపల్లి లక్ష్మణ్ నేత గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ గట్టి పట్టున్న మెదక్ లో, ఆ పార్టీ గెలుపు ఆశలు ఉన్న ఈ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువచ్చిన సువిధ పోర్టల్ ద్వారా ఈనెల 22న ఆన్ లైన్ నామినేషన్ వేసిన మారేపల్లి లక్ష్మణ్… ఫిజికల్ గా మెదక్ కలెక్టరేట్ కువెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ కు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. మేడ్చల్-మల్చాజిగిరి జిల్లా పేట్ బషీరాబాద్లో జర్నలిస్టులకు కేటాయించిన 38 ఎకరాలను వారికి అప్పగించాలని సుప్రీంకోర్టు 2022 అగస్టులో స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టి జర్నిలిస్టులకు అన్యాయం చేయాలని చూసింది. తమ స్థల సాధన కోసం జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సోసైటీ ఎన్నో రూపాల్లో పోరాడింది. ధర్నాలు చేసింది. చివరకు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జేఎన్‌జే జర్నలిస్టులు ఆ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆ ప్రయత్నంలో జేఎన్‌జే జర్నలిస్టులు సఫలమై కేసీఆర్ ను ఓడించడంలో తమదైన పాత్ర పోషించారు. ఈ లోక్ సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా తమ కార్యాచరణ తీసుకుంది. ఇందులో భాగంగా సీనియర్ జరల్నిస్టు మారేపల్లి లక్ష్మణ్ నేత మెదక్ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని మారేపల్లి లక్ష్మణ్ మీడియాతో చెప్పారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాకుండా ముమ్మర ప్రచారం చేస్తామని, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్ చేసిన అరాచకాలను జనాలకు తెలియజేస్తామన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను నిధులు, నియామకాలు, జలాలు లేకుండా ఎలా ప్రజలను మోసం చేశారో ప్రచారంలో ప్రజల చెంతకు తీసుకువెళతామని పేర్కొన్నారు. మారేపల్లి లక్ష్మణ్ కు పలు జర్నలిస్టు సంఘాలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి.
Hot this week
Telangana
వరద బాధితులకు యశోద హాస్పిటల్ గ్రూప్స్ కోటి రూపాయల విరాళం
భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకులం అయిన నేపథ్యంలో యశోద గ్రూప్ హాస్పిటల్స్...
National
Pension: ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే పెన్షన్ కట్.. హిమాచల్ ప్రభుత్వం సంచలనం
హిమచల్ ప్రదేశ్ శాసనసభలో సభ్యుల పెన్షన్లు, అలవెన్సులు సవరణ బిల్లు-2024ను ముఖ్యమంత్రి...
Telangana
డీజీపీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం తెలంగాణ...
Telangana
చినుకు పడిన క్షణం నుంచి ప్రజల్లోనే ఉన్నాం.. కేసీఆర్ లాగా ఫాంహౌస్ లో లేము: మంత్రి పొంగులేటి
2022లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చిన భారీ వర్షాలు, వరదలు నుంచి...
International
4-day workweek: ఇక వారానికి నాలుగు రోజులే పనిదినాలు.. ప్రభుత్వం సుముఖత
ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు ఐదు రోజులు పనిచేసే సంస్కృతి...
Topics

BJP Membership Drive: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని
భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ సభ్యత్వ నమోదు (National Membership...
Telangana
భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. వాగుల వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి సీతక్క
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ అప్రమత్తంగా అప్రమత్తంగా...
Cinema
Actress Radhika: కారవాన్ లో సీక్రెట్ కెమెరాలు.. బట్టలు మార్చుకుంటుంటే.. నటి రాధిక సంచలన వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ (casting couch) అనే పదం గత...