కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన, ఇటు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడుతోంది. శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్‌లో చేరికల సందడి నెలకొంది. కంది శ్రీనివాస్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కృషి, సామాజిక సేవలకు ఆకర్షితులై నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని 8,12 వార్డుల నుండి మహాకాల్ సేన అధ్యక్షుడు అజయ్‌తోపాటు పెద్ద సంఖ్యలో యువకులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
అందరం కలిసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని కంది శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, మాజీ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కాళ్ళ విట్టల్, ఐ.ఎన్.టి.యూ.సి జిల్లా అధ్యక్షులు మునిగేల విట్టల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, లోక ప్రవీణ్ రెడ్డి, బాయిన్ వార్ గంగా రెడ్డి,కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, ఆవుల వెంకన్న, బండారి సతీష్, సంద నర్సింగ్, రామ్ కుమార్, భూమన్న, నాయకులు బండి దేవిదాస్ చారి, యెల్టీ భోజా రెడ్డి, ఎం.ఏ షకీల్, కయ్యుమ్, సహిద్ ఖాన్, జగదీష్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, తలా చౌష్, ఎల్మ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.