బీఆర్ఎస్ పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) కాంగ్రెస్ గూటికి చేరారు. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇంట్లో ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిలు పాల్గొన్నారు. 2018, 2023 ఎన్నికల్లో సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుండి విజయం సాధించారు.
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి.. 39 సీట్లను గెల్చుకుంది. ఈ 39 మందిలో ఇప్పటికే తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి లు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా సంజయ్ కుమార్ చేరికతో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల సంఖ్య 5 కు చేరింది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) మరణంతో జరిగిన ఉప ఎన్నిక సీటు కూడా కాంగ్రెస్ గెల్చుకుంది. మొత్తానికి, బీఆర్ఎస్ బలం 39 సీట్ల నుండి 33 సీట్లకు పడిపోయింది. మరికొందరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
కాంగ్రెస్ లోకి జగిత్యాల బీఆరెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్.
— Telangana Congress (@INCTelangana) June 23, 2024
జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు.@revanth_anumula pic.twitter.com/zpIsfPakpS