చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ JAC నాయకులు చేర్యాల మండల కేంద్రంలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. నాయకులు అందె అశోక్, తాడెం ప్రశాంత్, బోయిని మల్లేశం సెల్ టవర్ ఎక్కి, రెవెన్యూ డివిజన్ ను ప్రభుత్వం ప్రకటించాలని నినాదాలు చేశారు. గత ఆరు సంవత్సరాలుగా అకిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు JAC గా ఏర్పడి అనేక ఉద్యమాలు చేస్తున్నామని JAC నాయకులు తెలిపారు. ఎన్ని ఉద్యమాలు చేసినా.. చేర్యాల ప్రాంత ప్రజల ఆవేదనను రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుల స్వంత జిల్లా ఆయన సిద్దిపేటలో ఉన్న ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని వెంటనే చేర్యాల డివిజన్ ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.
