జాతీయ, అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనం హైదరాబాద్, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జూన్ 14, 15వ తేదీలలో నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ టూరిజం, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ 3వ ఎడిషన్, 3వ టీసీఈఐ ఎస్ఐడబ్ల్యుపీసీ గ్లోబల్ 2024 బియాండ్ ఇమాజినేషన్, 7వ టీసీఈఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024 వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు అమీర్పేటలోని గ్రీన్ ల్యాండ్స్లో ని ది ప్లాజా, పర్యాటక్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.భారతీయ వివాహ పరిశ్రమలోని నిపుణులను ఇది ఒకచోట చేర్చుతుందన్నారు. ఈ ఈవెంట్ ద్వారా వివాహాలకు దక్షిణాది నుంచి ముఖ్యమైన సహకారం, జ్ఞానం, వేదికను అందించడం లక్ష్యమన్నారు.
భారతీయ వివాహ వ్యవస్థలోని వివిధ అంశాలపై జ్ఞానయుక్తమైన సెషన్లు ఉంటాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ వక్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారని తెలిపారు. డెలిగేట్లు జ్ఞాన మార్పిడి చేసుకోవడానికి ఇదొక వేడుకున్నారు. ఈ కన్వెన్షన్ కోసం దేశ, విదేశాలలో ఉన్న ఇరవై పైగా వెడ్డింగ్ ప్లానర్లు, వెడ్డింగ్ డిజైనర్లు, వెడ్డింగ్ స్టైలిస్ట్లు, డెకరేటర్లు, ఈవెంట్ మేనేజర్లు, ఈవెంట్ ఇండస్ట్రీలోని ఇతర క్రాఫ్ట్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయన్నారు. ఈ ఈవెంట్ కు సిడ్నీ నుంచి వెండీ ఈఎల్ భౌరీ సహా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిపుణులు హాజరవుతారన్నారు. టెడ్డీ ఇమ్మాన్యుయేల్ (ఫిలిప్పీన్స్), మైఖేల్ రూయిజ్ (ఫిలిప్పీన్స్), బ్రయాన్ టాచీ మెన్సన్ (ఘనా) తదితరులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇతర ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమం దేశ, విదేశాల నుంచి ఏడు వందల మందికి పైగా ప్రతినిధులకు స్వాగతం పలుకుతుందన్నారు. ‘ఈవెంట్ బజార్’గా పిలువబడే ఎక్స్పోలో 60 పైగా స్టాల్తో గ్రాండ్ డిస్ప్లే ఉంటుందన్నారు. ఈవెంట్ పరిశ్రమలో ఉన్న విభిన్న ఉత్పత్తులు, సేవలు, అత్యాధునిక ట్రెండ్లను ప్రదర్శిస్తుందని చెప్పారు, ప్యానెల్ చర్చలు, వర్క్షాప్లు, ఈవెంట్ సేఫ్టీ, టెక్నాలజీ పాత్ర తదితర కీలక అంశాలపై సమాంతర సిషన్లు కలవన్నారు. బిజినెస్ నెట్వర్కింగ్ లాంజ్ు కూడా ఉంటాయన్నారు. దేశంలోని అగ్రశ్రేణి హాస్పిటాలిటీ క్యాటరింగ్ కంపెనీలచే భోజనాలు అందించబడతాయన్నారు. వినోద ప్రదర్శనలు కూడా కలవన్నారు.
టీసీఈఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డులు
ఈ వేడుకలలో భాగంగా టీసీఈఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డుల ఏడో ఎడిషన్ 15 జూన్ 2024న సాయంత్రం ఐదు గంటల నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా రెండు కేటగిరీలలో అవార్డులు ఉన్నాయన్నారు. పర్ల్ ఆఫ్ హైదరాబాద్ ఈ అవార్డు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక అసాధారణమైన ఈవెంట్ లేదా అచీవరకు ఇవ్వనున్నట్లు చెప్పారు. జెమ్ ఆఫ్ ఇండియా అవార్డు భారతదేశంలోని ఏదైనా ప్రాంతంలో నిర్వహించిన లేదా ప్రదర్శించిన అసాధారణ ఈవెంట్ లేదా అచీవర్ కు అందించనున్నామని తెలిపారు.
‘జాడే ఆఫ్ ఇండియా’ ఈవెంట్ ఇండస్ట్రీలో పదిహేను ఏళ్లకు పైగా పనిచేసిన ఇండస్ట్రీ లీడర్లకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నామన్నారు.
‘లైఫ్ టైమ్ అచీవ్ మెంట్’ ఈవెంట్ ఇండస్ట్రీలో ముప్పై ఏళ్లకు పైగా పనిచేసిన ఇండస్ట్రీ లీడర్లు ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నామన్నారు.
‘కోహ్-ఇ-నూర్ ఆఫ్ ఇండియా’ హైదరాబాద్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు, ప్రశంసలు తెచ్చిన ఈవెంట్కు ఈవెంట్ మేనేజర్ లేదా కంపెనీకి అత్యున్నత గౌరవం ఇవ్వనున్నామన్నారు.
ఈ సమావేశంలో పర్యాటక శాఖ డైరెక్టర్ కే రమేష్ నాయుడు, హైటెక్స్ హెడ్ టీజీ శ్రీకాంత్, టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాం బాబు, ప్రధాన కార్యదర్శి రవి బురా, కోశాధికారి ఎండీ తౌఫిక్ ఖాన్, ఎస్ఐడబ్ల్యుపీన్ గ్లోబల్ 2024 కన్వీనర్ సాయి శ్రవణ్ మాదిరాజు, టీసీఈఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024 కన్వీనర్ రామ్ కే ముప్పన, కో-కన్వీనర్లు హిరీష్ రెడ్డి, కుమార్ రాజా, సుధాకర్, యారబడి, డాక్టర్ సౌరభ్ సురేఖ తదితరులు పాల్గొన్నారు.