తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం విడుదల చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. జూన్ 2న తెలంగాణ ఆవవిష్కరణ దినోత్సవం రోజున విడుదల చేస్తారని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో ప్రభుత్వం లోగో ఆవిష్కరణను వాయిదా వేసింది. అయితే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణ జరగనుంది.
రాష్ట్రం చిహ్నం విషయంలో ప్రముఖులతో ప్రభుత్వం ఇంకా చర్చలు జరుపుతుంది. ఇంకోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే లోగో మారుస్తుందని, ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తోంది. దీంతో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ప్రభుత్వం వాయిదా వేసినట్లు తెలుస్తోంది.