తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్ అధికారులను ఒకేసారి ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించింది. ఆయనకు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవోను విడుదల చేశారు.
చేనేత, హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్ ను బదిలీ చేశారు. ఆమెకు హ్యాండ్లూమ్స్, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్ MDగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో కొనసాగిన రొనాల్డ్ రోస్‌ను విద్యుత్ శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆయనకు జెన్‌కో మరియు ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలు కేటాయించారు.
పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా ఉన్న దేవసేనను కళాశాల, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌గా బదిలీ చేశారు. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, క్రీడల, పర్యాటక, శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్ నియమించారు. ఆయనకు టీపీటీఆర్‌ఐ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా ఉన్న రిజ్వీని వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డిని నియమించారు. దాసరి హరిచందనను రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
బదిలీ అయిన ఐఏఎస్‌ల జాబితా:
పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్
కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్
యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్
చేనేత, హస్త కళల ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్య
జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి
హౌసింగ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ముఖ్య కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రసాద్
స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా సోనీ బాలాదేవి
హ్యాండ్లూమ్స్, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్ ఎండీగా శైలజకు అదనపు బాధ్యతలు
అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్.. టీపీటీఆర్‌ఐ డీజీగా అహ్మద్ నదీమ్‌కు అదనపు బాధ్యతలు
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా రిజ్వి
రవాణా శాఖ కమిషనర్‌గా కే. ఇలంబరితి
జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా స్నేహా శబరి
జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా అనురాగ్ జయంతి
జీహెచ్‌ఎంసీ ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్‌గా హెచ్‌కే. పాటిల్
జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా అపూర్వ్ చౌహన్
జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా ఉపేందర్ రెడ్డి
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు
జీహెచ్‌ఎంసీ, విజిలెన్స్, విపత్తు నిర్వహణ కమిషనర్‌గా రంగనాథ్
హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్
జల మండలి ఎండీగా కే. అశోక్ రెడ్డి
కళాశాల, సాంకేతిక విద్యా శాఖల కమిషనర్‌గా శ్రీదేవసేన
సెర్ప్ సీఈవోగా డీ. దివ్య.. ప్రజా వాణి నోడల్ అధికారిగా దివ్యకు అదనపు బాధ్యతలు
రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా హరిచందన
పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ఎన్. ప్రకాశ్ రెడ్డి
ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా అలగ్ వర్షిణి
గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా వీపీ గౌతమ్.. పురపాలక శాఖ డైరెక్టర్‌గా గౌతమ్‌కు అదనపు బాధ్యతలు
ఉపాధి, శిక్షణ శాఖల డైరెక్టర్‌గా కృష్ణా ఆదిత్యకు అదనపు బాధ్యతలు
ఐటీ ఉప కార్యదర్శిగా భవేష్ మిశ్రా
కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా జీ. రవి
గ్రామీణాభివృద్ధి సీఈవోగా కే. నిఖిల
ఉద్యాన వన డైరెక్టర్‌గా యాస్మిన్ బాషా
ఆయిల్ ఫెడ్ ఎండీగా యాస్మిన్ బాషాకు అదనపు బాధ్యతలు
ప్రొటోకాల్ డైరెక్టర్‌గా ఎస్. వెంకట్రావు
వ్యవసాయ, సహకార సంయుక్త కార్యదర్శిగా జీ. ఉదయ్ కుమార్
పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌గా గోపికి అదనపు బాధ్యతలు
ఫిషరీస్ డైరెక్టర్‌గా ప్రియాంక
మూసీ అభివృద్ధి జేఎండీగా గౌతమి
టీజీ ఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నిఖిల్ చక్రవర్తి
టూరిజం డైరెక్టర్‌గా ఐలా త్రిపాఠి
రాష్ట్ర ఆర్థిక సంఘం ఎండీగా కాత్యాయని దేవి
పాఠశాల విద్యా డైరెక్టర్‌గా నర్సింహా రెడ్డి
సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నర్సింహా రెడ్డికి అదనపు బాధ్యతలు
వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా సహదేవ రావు
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా అభిషేక్ అగస్త్య
భద్రాచలం ఐటీడీఏ పీవోగా రాహుల్
IAS transfers and Postings in Telangana@revanth_anumula pic.twitter.com/4c0E5gkj0D
— jacobrossbhoompag (@jacobbhooopag) June 24, 2024