జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా (HYDRA) పని చేస్తుంది. తాజాగా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను అధికారులు శనివారం తెల్లవారుఘామునే కూల్చివేతను ప్రారంభించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. మాదాపూర్ లోని తమ్మిడి చెరువులోని మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జాచేసి కన్వెన్షన్ నిర్మించారని ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే చెరువు FTL పరిదిలో నిర్మించిన కన్వెన్షన్ ను హైడ్రా బృందం నేలమట్టం చేసింది.