NewsTelanganaహుస్నాబాద్ నియోజకవర్గాన్ని అగ్ర స్థానంలో నిలబెడుతా: మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అగ్ర స్థానంలో నిలబెడుతా: మంత్రి పొన్నం ప్రభాకర్

-

- Advertisment -spot_img

హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. ప్రజా సమస్యలపై, ప్రజల వద్దకే ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గ పర్యటన లో భాగంగా చిగురు మామిడి ,వై .సైధాపూర్ , ఎల్కతుర్తి , భీమదేవర పల్లి మండలాల్లో మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో విసృత స్థాయి సమావేశంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ లో తక్షణమే ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. ప్రజల నుండి వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామ అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామంలోని వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అందులో తక్షణమే పరిష్కారం అయ్యే సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.

గ్రామాల్లో వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో విద్యుత్ ,తాగు నీటి లేకుండా చూడాలని ,స్కూల్ లలో జరుగుతున్న పనులు ఏమైనా పెండింగ్ లో ఉంటే త్వరగా పూర్తి చేయాలని కోరారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో గ్రామాల్లో పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా దోమల విషయంలో కూడా ముందస్తు జాగ్రతలు చేపట్టాలని తెలిపారు. పలు గ్రామాలకు ఆర్టీసి బస్సు రావడం లేదని ,సీసీ రోడ్ల నిర్మాణం,మురుగు కాలువల నిర్మాణం లాంటివి పూర్తి చేయాలని స్థానిక ప్రజలు మంత్రిని కోరారు.

తనని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే గా గెలిపించారని వారు ఇచ్చిన అవకాశంతో మంత్రి అయి సేవ చేయడానికి వచ్చానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తొడ్పడతానని ఎంతా బిజీగా ఉన్న తనని గెలిపించిన ప్రజల సమస్యలు తీర్చడానికి నేరుగా మండలాలు గ్రామాల్లోకి వస్తున్నానని పేర్కొన్నారు. ఈ నెల 21 నుండి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన పర్యటిస్తానని నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తేవాలని ఎప్పటికీ హుస్నాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటానని మంత్రి పొన్నం వెల్లడించారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంగా నిలబెట్టడమే లక్ష్యంగా పని చేస్తానని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు,గ్రామ శాఖల అధ్యక్షులు, జడ్పీటిసిలు, ఎంపిటిసిలు ఎంపీపీలు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

ఆదివాసీ సాంప్ర‌దాయాల‌కు అనుగుణంగా మేడారం ఆధునికీకరణ పనులు

ఆదివాసీ సాంప్ర‌దాయాల‌కు అనుగుణంగా మేడారం ఆధునికీకరణ పనులు ఉంటాయిని మంత్రి సీత‌క్క తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ఆధునికీకరణ పనులపై మంత్రి సీతక్క ఉన్నతస్థాయి...

అనుపమ పరమేశ్వరన్ ‘పరాదా’ మూవీ పై ఆసక్తికర వ్యాఖ్యలు !

అనుపమ పరమేశ్వరన్ 'పరాదా' మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తార, ప్రస్తుతం మలయాళంలో రూపొందుతున్న 'పరాదా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు...

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల లెక్క ఖరారు

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల లెక్క ఖరారు అయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోెర్టు ఇచ్చిన సెప్టెంబర్ 30 గడువు దగ్గర పడుతున్నది. ఈనేపథ్యంలో...

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...
- Advertisement -spot_imgspot_img

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you