నిన్న రాత్రి కురిసిన వర్షానికి వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంకిరెడ్డిపల్లి తాండాలో ఓ ఇల్లు కూలిపోయింది. తమకు ఉండడానికి ఇల్లు కూడా లేదని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఇంటి యజమాని చరణ్ సింగ్ వేడుకుంటున్నాడు. గతంలో తమకు ఇందిరమ్మ పథకం ద్వారా లబ్ది జరిగిందని.. ఇప్పుడు కూడా ప్రభుత్వం తమకు డబుల బెడ్రూం ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.