బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. అనుమతులు లేకుండా నిర్మించిన నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూల్చేయాలని తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఏం జరిగింది?
బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించిందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. అనుమతులు లేకుండా నిర్మించిన ఆ నిర్మాణాన్ని కూల్చివేయాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు.
హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్
తమ పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తాజాగా హైకోర్టు తీర్పు వెలువరించింది. పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని BRS ను హైకోర్టు ప్రశ్నించింది. కట్టకముందు అనుమతి తీసుకోవాలి కానీ, కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని కూడా ప్రశ్నించింది. 15 రోజుల్లోగా పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడంతో పాటు లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీకి హైకోర్టు ఆదేశించింది.