మంత్రులు నర్సంపేటలో మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి ప్రారంభిస్తున్నారన్న కారణంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహా, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌజ్ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా తెలిపారు.
మెడికల్ కాలేజీ మంజూరు చేసి, జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది కేసీఆర్ అయితే.. ఆ ఘనతను తమ ఖతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుటిలయత్నాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. ప్రజా పాలన అంటూ ప్రతిపక్ష నాయకులను అరెస్టులు, అష్టదిగ్బంధనాలు చేయడం అప్రజాస్వామికమైన చర్య అని అన్నారు. హౌజ్ అరెస్ట్ చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి సహా, బిఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
మంత్రులు వచ్చి నర్సంపేట మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి ప్రారంభిస్తున్నారన్న కారణంతో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహా, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌజ్ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
— Harish Rao Thanneeru (@BRSHarish) September 19, 2024
మెడికల్ కాలేజీ మంజూరు చేసి జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది… pic.twitter.com/pyoBkLgcZh