Thursday, March 27, 2025
HomeNewsTelanganaGulf policy: జనవరిలో గల్ఫ్ పాలసీ : బీఆర్ఎస్

Gulf policy: జనవరిలో గల్ఫ్ పాలసీ : బీఆర్ఎస్

ఇప్పటికే అన్ని వర్గాల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు ప్రకటించిన భారత రాష్ట్ర సమితి ఈరోజు మరో కీలకమైన అంశం పైన ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికోసం ప్రత్యేకంగా ఒక గల్ఫ్ పాలసీని తీసుకువస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ప్రకటించారు. అధికారంలోకి రాగానే నూతన సంవత్సరం జనవరిలో గల్ఫ్ పాలసీని అమలులోకి తీసుకువస్తామని తెలియజేశారు. ప్రధానంగా గల్ఫ్ లో ఉపాధి కోసం వెళ్ళిన వారికి సైతం గల్ఫ్ బీమా కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా మాదిరే రానున్న ప్రభుత్వంలో గల్ఫ్ ప్రవాసీలకు కూడా భీమా అందిస్తామని తెలిపారు. ఈ గల్ఫ్ బీమా పథకం కింద ఐదు లక్షల బీమా కవరేజ్ ప్రతి ఒక్క వ్యక్తికి అందుతుందని తెలిపారు. దీంతోపాటు గల్ఫ్ పాలసీలో భాగంగా ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా కలిపి సమగ్రమైన పాలసీని అమలులోకి తీసుకువస్తామని తెలియజేశారు. ఈ మేరకు కేటీఆర్ తన సిరిసిల్ల రోడ్ షోలో ప్రకటన చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments