ఖైరతాబాద్ గణనాథుడు ఈ సంవత్సరం దశ మహా విద్యా గణపతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. సోమవారం ఉదయం గణేషునికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్వామి వారికి తొలి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తో పాటు, హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీవివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి తలసాని గణపతికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై వినాయక చివితి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ గణనాధుడిని దర్శించుకోవడం తనకు సంతోషంగా ఉందని తమిళిసై అన్నారు. గణేష్ ఉత్సవ కమటి, ప్రభుత్వం కలిసి ఏర్పాట్లను బాగా చేశారని గవర్నర్ అన్నారు.
