టీఎస్‌ఆర్టీసీ కార్మికులను, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుక వచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆమోదించారు. అనంతరం ఆమె కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.
బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు గవర్నర్ కన్సెంట్ కు ముందు ఆమె 10 సిఫార్సులు చేశారు. ఆ సిఫార్సులు బిల్లులో పొందు పరిచారా ? లేదా ? అని తెలుసుకునేందుకు బిల్లును న్యాయ శాఖకు పంపారు. ఆర్టీసీ, కార్మికుల, భద్రత, సంక్షేమమే ముఖ్యమని గవర్నర్ తమిసై పలుమార్లు వెల్లడించారు. అసెంబ్లీ ఆమోదించిన దాదాపు నెల రోజుల తర్వాత దాదాపు నెల రోజుల తర్వాత గవర్నర్ ఈ బిల్లును ఆమోదించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.