మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 455 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 94 , పౌరసరఫరాల శాఖ కు సంబంధించి 77 , విద్యుత్ శాఖ కు సంబంధించి 45, హౌజింగ్ కు సంబంధించి 44 దరఖాస్తులు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కు సంబంధించి 40, ఇతర శాఖలకు సంబంధించి 155 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా.చిన్నారెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.