అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ప్రారంభమైంది. అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పుటు చేశారు. అన్నిప్రభుత్వ శాఖల సమన్వయంతో అధికార యంత్రాంగం పండుగ విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నలుమూలల నుండి భక్తులకోసం ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. 200మందితో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. షీటీమ్స్ గుడిపరిసరాల్లో గస్తీకాస్తున్నారు. ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పనిచేస్తున్నారు.
ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. రాష్ట్రం సుబిక్షంగా వుండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ఉదయం నుండే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అమ్మవారిని దర్శించుకొన్నారు.