Tuesday, March 25, 2025
HomeNewsTelanganaగణేష్ నిమజ్జనం విజయవంతం: GHMC కమీషనర్ ఆమ్రపాలి

గణేష్ నిమజ్జనం విజయవంతం: GHMC కమీషనర్ ఆమ్రపాలి

హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగినట్లు జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి డి. శ్రీధర్ బాబు గణేష్ సన్నాహక సమావేశాలు నిర్వహించి, అదే విధంగా జిహెచ్ఎంసి లో మేయర్ అధ్యక్షత గణేష్ ఉత్సవ కమిటీ  ప్రతినిధులు, అధికారులతో సన్నాహక, సమన్వయ సమావేశాలు నిర్వహించి గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా  ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.సిటీ పోలీస్, హెచ్ఎండిఎ, వాటర్ వర్క్స్, విద్యుత్, ట్రాఫిక్ పోలీస్ సమన్వయంతో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిమజ్జన పక్రియ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో  డిప్యూటీ కమిషనర్ లు, యుబిడి, యుసిడి, పోలిస్, విద్యుత్ విభాగాల అధికారులు శోభాయాత్ర సందర్భంగా ఎదురయ్యే సమస్యలను ముందుగా గుర్తించి రోడ్డు మరమ్మత్తులు, చెట్ల కొమ్మలు తొలగించడం, విద్యుత్ దీపాల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నిర్వాహక మండలి ప్రతినిధులు  సూచనలు సలహాలతో ఆయా  ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనానికి ప్రజలు పూర్తి సహకారం అందించడంతో పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యిందని పేర్కొన్నారు. 

ముఖ్యంగా జిహెచ్ఎంసి ఉన్నత స్థాయి అధికారులు, సిబ్బంది, శానిటేషన్ కార్మికులు సమన్వయ కృషితో పాటు మీడియా సూచనలు ఇవ్వడం మూలంగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని, నిమజ్జనం రోజున   ముఖ్యమంత్రి , మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,  బి సి సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,  ఎమ్మెల్సీ  మహేష్ కుమార్ గౌడ్ లతో కలిసి ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిమజ్జనం పరిశీలన కోసం వచ్చారు. ఈ  సందర్భంగా ముఖ్యమంత్రి శానిటేషన్, క్రేన్ ఆపరేటర్లు, హెల్పర్ల సమస్యలు విన్న ముఖ్యమంత్రి వెంటనే వారి రెస్టు కోసం వసతి కల్పించాలని జిహెచ్ఎంసి కమిషనర్ ను ఆదేశించడంతో వెంటనే కమిషనర్ జోనల్ కమిషనర్ లకు ఆదేశాలు జారీ చేసి వారి వారి పరిధిలో రెస్టు బస్సులు ఏర్పాటు చేసారు. గణేష్ ఉత్సవాల కోసం జిహెచ్ఎంసి 73 వివిధ పాండ్స్, చెరువుల వద్ద భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు షిఫ్ట్ సిస్టమ్ తో 24 గంటల పాటు పనిచేసే విధంగా  శానిటేషన్ కార్మికులకులతో పాటుగా  యు సి డీ, హెల్త్, ఇతర విభాగాల అధికారులు మొత్తం 15 వేల మంది సిబ్బంది పని చేసారని, గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భక్తుల సేవలో జిహెచ్ఎంసి ఉందని అన్నారు. నిమజ్జనం నేపథ్యంలో మంగళవారం బి సి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, డి జి పి డాక్టర్ జితేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి లతో కలిసి ఏరియల్ సర్వే చేసి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి అక్కడిక్కడే సమస్యను పరిష్కరించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చేసారు.  

జిహెచ్ఎంసి వ్యాప్తంగా  ఏర్పాటు చేసిన పాండ్స్,  చెరువులలో నిమజ్జనం సందర్భంగా  మొత్తం 465 స్టాటిక్, మొబైల్ క్రేన్ లు ఏర్పాటు చేసారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులు సెలబ్రేట్ మూడ్ లో ఉన్న నేపథ్యంలో  పేపర్ కటింగ్ వ్యర్థాలను రోడ్ల పై  నిమజ్జనం ప్రదేశాలలో భక్తులు  వెదజల్లడం వలన రోడ్డు అపరిశుభ్రంగా ఉండడం తో పాటుగా శానిటేషన్ కార్మికులు అనారోగ్య పాలు కాకుండా ఉండేందుకు ఆధునిక యంత్రాల ను కమిషనర్ ఫీల్డ్ లో పెట్టించి కట్టింగ్ పేపర్ వ్యర్థాలను యంత్రాల ద్వారా తొలగించారు. రెండో రోజు కూడా నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. నిమజ్జనం పూర్తయిన ప్రాంతంలో శానిటేషన్ పై దృష్టి సారించాలని జోనల్ కమిషనర్ లకు సూచించారు. ఇంకా నిమజ్జనం ప్రక్రియ రెండో రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో   నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి  అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చార్మినార్ జోన్ లో  19న మిలాదున్ నబి వేడుకలు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధాన, అంతర్గత రోడ్లలో పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. చెత్తను, వ్యర్థాలను తొలగించి డంప్ యార్డు కు తరలించేందుకు అవసరమైన వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిహెచ్ఎంసి ఉన్నతాదికారులు, శానిటేషన్ కార్మికులు, సిబ్బంది అందరూ కష్టపడి పని చేసి గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కమిషనర్ ఆమ్రపాలి కాట అభినందించారు. ఇదే స్ఫూర్తి  మున్ముందు చేపట్టబోయే పనులు విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments