హైదరాబాద్ లో రెండోరోజు గణేశ్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది.జీహెచ్ఎంసీ పరిధిలో 71 ప్రాంతాల్లో ఇప్పటివరకు ఒక లక్షా 3వేల 500 గణనాథుల విగ్రాహాలు గంగమ్మ ఒడికి చేరాయి. అత్యధికంగా మూసాపేటలోని IDL చెరువులో 26 వేల 546 విగ్రహాల నిమజ్జనం జరిగింది. ఇటు హుస్సేన్ సాగర్ కు భారీగా వినాయక విగ్రహాలు తరలివస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది.