కాంగ్రెస్ సీనియర్ నేత, పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వెంకట స్వామి (కాకా) 95వ జయంతి వేడుకలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్నసాగర్ పార్క్ లొని కాకా విగ్రహానికి ఎమ్మేల్యేలు వివేక్, వినోద్, వంశీలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, కాకా అభిమానులు నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రభుత్వం కాాకా జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించింది. రవీంద్రభారతిలో కాకా జయంతి వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీ కృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్, ప్రేమ్ సాగర్ రావు, నాగరాజు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటస్వామి పేద ప్రజలకు చేసిన సేవలను నేతలు స్మరించుకున్నారు.