అల్వాల్ లోతుకుంట గ్రిల్ హౌస్ హోటల్ లో షావర్మాతో పాటు మయోనైజ్ తిన్న 17 మంది వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట నలుగురు బాధితులు మాత్రమే ఉండగా మంగళవారం రాత్రికి ఆ సంఖ్య 17కు చేరింది. బాధితుల ఫిర్యాదుతో ఐదు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.