సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది ఆనవాయితి పరంగా వస్తున్న ఆచారం ప్రకారం అత్తిలి కుటుంబీకులు మొదటి బోనం అమ్మవారికి సమర్పించారు. ఆషాడ మాసం అమ్మవారి బోనం సమర్పించే ఆనవాయితీ వారి కుటుంబీకులకు ఉందని ప్రతి ఏటా క్రమం తప్పకుండా అంగరంగ వైభవంగా జోగిని శ్యామలతో బోనం ఎక్కించి అమ్మవారికి సమర్పించడం ఎంతో సంతోషదాయకంగా ఉంటుందని కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారం చేసే తల్లిగా వెలసిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కృప కరుణా కటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.