Menu

  • Home
  • తెలంగాణ
  • ఘనంగా మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు
Image

ఘనంగా మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత సూదిని జైపాల్‌ రెడ్డి 82వ జయంతి వేడుకలను పీవీఎన్ఆర్ మార్గ్ స్ఫూర్తి స్థల్ లో ఘనంగా నిర్వహించారు. ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి ఘాట్ వద్ద ఆయనకు నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ… కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి పాటించిన నైతిక విలువలు భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. జైపాల్ రెడ్డి ఓ మహా నాయకుడు దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసున్నారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చాలా కీలక పాత్ర పోషించారని, హైద‌రాబాద్ కు మెట్రో రావ‌డంలో జైపాల్ రెడ్డి గారి కృషి ఎంతో ఉందని, జైపాల్ రెడ్డి గారి చొర‌వ‌తోనే క‌ల్వ‌కుర్తి ఎత్తిపోత ప‌థ‌కం సాకార‌మైందని ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా స‌స్య‌శ్యామ‌లం అయ్యేందుకు ఆయ‌నే పునాదులు వేశారని, దేశానికి, రాష్ట్రానికి జైపాల్ రెడ్డి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుందని అన్నారు.

దేశానికి, రాష్ట్రానికి ఆయ‌న చేసిన సేవ‌లుగా గుర్తుగా జైపాల్ రెడ్డి జ‌యంతి వేడుకలను కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హిస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ మల్లు రవి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share the post

Also Read..