Menu

  • Home
  • తెలంగాణ
  • vivek venkataswamy: కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ వివేక్
Image

vivek venkataswamy: కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ వివేక్

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి బీజేపీకి రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా బీజేపీ కార్యక్రమాలకు వివేక్ దూరంగా ఉంటున్నారు. బుధవారం తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. తను పార్టీ ప్రాథమికి సభ్యత్వానికి, పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. పార్టీలో తనకు ఇన్నిరోజులు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తనతోపాటు తన కుమారుడు వంశీ కూడా పార్టీకి రాజీనామా చేశారు.

vivek resignation for BJP

కాంగ్రెస్ లో చేరిక

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వివేక్ తో ఫోన్ లో మాట్లాడారు. ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తెలంగాణ పర్యటనలోనే ఉన్న రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్, అతని కుమారుడు వంశీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలని వివేక్ అన్నారు.

Share the post

Also Read..