TSPSC: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి?

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి నియమితులయ్యే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించినట్లు తెలిసింది. వారిలో మహేందర్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నట్లు సమాచారం.

గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్‌రెడ్డి ఛైర్మన్‌ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఛైర్మన్‌, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఛైర్మన్‌ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్‌) కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్‌ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమై దరఖాస్తులను పరిశీలించింది.

ఛైర్మన్‌ పదవి కోసం మహేందర్‌రెడ్డితో పాటు ఓ విశ్రాంత అధికారి, రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న మరో ఐపీఎస్‌ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిలో మహేందర్‌రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియామకానికే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్‌ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపించినట్లు తెలుస్తోంది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

Topics

ఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన గిరిజన విద్యార్థి

మృత్యువే గెలిచింది.. దాదాపు 20 రోజులకుపైగా నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

RGV: రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్దం! హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం...

పండుగ వాతావరణంలో ప్రజాపాలన విజయోత్సవాలు

డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img