భారత రాష్ట్ర సమితిలో చేరిన ఎర్రశేఖర్

మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి.. బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతో బలమైన నేతగా ఉన్న ఎర్ర శేఖర్.. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. మహబూబ్నగర్ జిల్లా సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఈరోజు భారత రాష్ట్ర సమితిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరారు. గులాబీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వనించిన మంత్రి కేటీఆర్. ఎర్ర శేఖర్ చేరికతో పాలమూరులో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందన్నరు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని ఎర్ర శేఖర్ ప్రకటించారు.

ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉన్నదని, మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశానని ఎర్ర శేఖర్ చెప్పారు.తెలంగాణ ఉద్యమ కాలం నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో తనకు గొప్ప అనుబంధం ఉందని ఎర్రశేఖర్ తెలిపారు. గతంలో మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్న కేసీఆర్ గారితో కలిసి పనిచేసిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచేలా ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ గారు చేపట్టారని ఈ సందర్భంగా ఎర్ర శేఖర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యంగా ముదిరాజులను ఆర్థికంగా స్థితి మంతులను చేసేందుకు చేపట్టిన కార్యక్రమాలను భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయేందుకు కేసిఆర్ గారి నాయకత్వంలో నడిచేందుకు ఈరోజు పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనలో ఒకప్పుడు దయనీయంగా ఉన్న ముదిరాజుల జీవితాలు ఈరోజు ప్రభుత్వం చేపట్టిన చేపల పంపిణీ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల వంటి కార్యక్రమాల వలన గుణాత్మక మార్పు వచ్చిందని, మత్స్య సంపద విపరీతంగా పెరిగిందని ఎర్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు బీసీల కోసం చేపట్టిన అనేక అద్భుతమైన కార్యక్రమాలు పట్ల కెసిఆర్ కి ధన్యవాదాలు తెలిపిన ఎర్రశేఖర్, కెసిఆర్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో పనిచేస్తానని తెలిపారు.

Share the post

Hot this week

‘రెడ్ ఫ్లవర్’ సినిమా కోసం హంగేరియన్ ఆర్కెస్ట్రా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌

‘రెడ్‌ఫ్లవర్’ (Redflower) సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కంపోజింగ్‌ కోసం హంగేరియన్‌ ఆర్కెస్ట్రా...

నటి కాదంబరి జత్వాని కేసు.. ముగ్గురు ఐపీఎస్ లపై సస్పెన్షన్ వేటు

నటి కాదంబరి జెత్వానీ (Kadambari Jethwani)పై వేధింపుల కేసులో ఏపీ ప్రభుత్వానికి...

ఫార్మా సిటీ ప్రాజెక్ట్ ను కొనసాగిస్తున్నారా? లేదా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ

హైదరాబాద్ లో తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా?...

డిప్యూటీ సీఎం భట్టికి అరుదైన గౌరవం.. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం

తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. ఈనెల...

రేపే సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ

తెలంగాణ సచివాల‌యం ముందు దివంగ‌త మాజీ ప్ర‌ధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్ర‌హాన్ని...

Topics

Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షునిగా బొమ్మ మహేశ్‌ కుమార్‌...

సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన.. రెండు రోజుల్లో రాజీనామా

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు....

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీలో కొనసాగుతున్న బోట్ల వెలికితీత పనులు

ప్రకాశం బ్యారేజ్‌ (Prakasam Barrage) వద్ద బోట్ల తొలగింపు పనులు నిరాటంకంగా...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img