ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న (మంగళవారం) విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గత సంవత్సరం మార్చినెలలో మూడు రోజులపాటు కవితను విచారించారు. గతంలో కవిత ఈడీ విచారణపై.. మహిళలను ఇంట్లోనే విచారించాలని కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు నడుస్తుండగానే.. తాజాగా కవితకు నోటీసులు వచ్చాయి. అయితే కవిత విచారణకు హజరు అవుతారా.. లేదా అనేది ఇంకా ఆమె నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.