టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఇండియాలో పర్యటించనున్నారు. ఏప్రిల్‌లో భారత్‌లో పర్యటించి, ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నట్టు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా భారతదేశంలో పెట్టుబడులు, టెస్లా కొత్త ఫ్యాక్టరీపై ప్రకటన ఉండే అవకాశం ఉంది. అయితే మస్క్ పర్యటన భారత్ లో ఎన్నికలు జరిగే సమయంలో ఉండడం గమనార్హం.
Looking forward to meeting with Prime Minister @NarendraModi in India!
— Elon Musk (@elonmusk) April 10, 2024