రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో భారీగా ఎస్పీలు, కమిషనర్లను బదిలీ చేస్తూ తాజాగా సీఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఇప్పుడు ట్రాన్స్ ఫర్ అయిన 13 మంది పోలీసు అధికారులలో 9 మంది నాన్ క్యాడర్ పోలీసు అధికారులు కూడా ఉన్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లను బదిలీ చేస్తున్నట్టు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మం ఎస్పీ విష్ణువారియర్‌తో పాటు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలను జారీ చేసింది. అదే విధంగా మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లను కూడా సీఈసీ బదిలీ చేసింది. రవాణా శాఖ కార్యదర్శి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌ను కూడా తొలగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. బదిలీ అయిన స్థానాల్లో కొత్తగా నియమించే ప్యానల్ లిస్టులో ఒక్కో పోస్ట్ కు ముగ్గురు చొప్పున అధికారులు పేర్లను రేపు సాయంత్రం ఐదు గంటల లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని దేశించింది.