రాష్ట్రంలో యాసంగి రైతుబంధు నిధుల విడుదలకు రెండు రోజుల క్రితం ఎలక్షన్ కమీషన్ ఓకే చెప్పింది. రైతులకు నిధులు విడుదల చేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. అయితే 25 నుండి 27వరకు బ్యాంకులకు సెలవు కావడంతో రైతుబందు నిధుల విడుదల కాలేదు. ఈనెల 28 నుండి నిధులు విడుదల చేస్తామని ఓ సీనియర్ బీఆర్ఎస్ మంత్రి వ్యాఖ్యానించారు. ఆ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం రైతు బంధు నిధుల విడుదల కు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.