రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశలు ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ ఎలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో రెండు రోజుల భారీ వర్షాలు కురుసే అవకాశం ఉన్నందున ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాతావరణ శాఖ రెడ్ ఎలర్ట్ సూచించిన నేపథ్యంలో సోమవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 59 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగా తరలించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్, ఆర్ అండ్ బి శాఖలతో పాటు జిహెచ్ఎంసి అధికారులు కూడా నిరంతరం విధులలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే హైదరాబాద్ కలెక్టరేట్ లోని కంట్రోల్ నెం. 040-23202813 / 9063423979 నెంబర్ తో పాటు హైదరాబాద్ ఆర్డిఓ హైదరాబాద్ 7416818610 / 9985117660 ,సికింద్రాబాద్ ఫోన్ నెంబర్ 8019747481నెంబర్లకు ఫోన్ చేసి సమస్యలు, ఇబ్బందులను తెలియజేయాలనీ ప్రజలకు కోరారు.