కురువ/ కురుమలు జరుపుకునే బీరప్ప బండారు ఉత్సవంలో మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ పాల్గొన్నారు. బీరప్ప దేవునికి ప్రత్యేక పూజలు చేశారు. మక్తల్ నియోజకవర్గం పెద్దపుర్ల గ్రామంలో జరిగిన బీరప్ప ఉత్సవాల్లో డీకే అరుణతో పాటు మహబూబ్ నగర్ పార్లమెంట్ ఓబీసీ కోఆర్డినేటర్ శంకరోల్ల రవికుమార్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.