ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు తనను ఎమ్మెల్యేగా పరిగణించి, ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని కలిసి హైకోర్టు కాపీలను, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని బీజేపీ జాతీయ అద్యక్షురాలు డీకే అరుణ కోరారు. గద్వాలలొ 2018 లో గెలిచిన అభ్యర్థి క్రిష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ ఆమె కోర్టును ఆశ్రయించడం జరిగింది. తన పిటీషన్ పై విచారణ జరిపిన హైకొర్టు ఆయనను అనర్హుడుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. మరోవైపు కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా రాష్ట్రంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ కాపీ లను స్పీకర్ కార్యలయంతో పాటు అసెంబ్లీ కార్యదర్శిని కలసి.. తన ప్రమాణ స్వీకారం కోసం ఎర్పాటు చేయాలనీ కోరారు.