డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) డాక్టర్ జితేందర్ డయల్ 100/112 పనితీరుపై పోలీస్ కమిషనర్లతో, ఎస్పీలతో మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ…. శాంతి భద్రతలు కాపాడటంలో, త్వరితగతిన పోలీసు సిబ్బంది స్పందించడంలో డయల్ 100 మరియు డయల్ 112 కీలక పాత్రను నొక్కిచెప్పారు. డయల్ 100 /112హెల్ప్‌లైన్ ద్వారా వచ్చిన కాల్స్ పై సత్వర మరియు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని డిజిపి స్పష్టం చేశారు.
అదనపు డిజిపి లు మహేష్ ఎం భగవత్ , వి.వి. శ్రీనివాసరావు, ఐజిపీలు ఎం. రమేష్, వి.సత్యనారాయణ, హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ పరిమళ హన నూతన్ ఇతర పోలీసు అధికారులు హాజరై డయల్ 100 /112సర్వీస్‌ను మెరుగుపరచడం కోసం విలువైన సూచనలు, సలహాలు అందించారు. పోలీసు సిబ్బంది పై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో, నైపుణ్యం , స్పందనలో అత్యున్నత ప్రమాణాలను పాటించాలని డిజిపి సూచించారు.