మేడారం సమ్మక్క సారలమ్మను ఒక భక్తురాలు అమ్మవార్లను కోరుకున్న కోరికల చిట్టా బయట పడింది. ఆమె విచిత్రమైన కోరిక కోరుకున్నది. తన భర్త బెట్టింగ్ కట్టడం మానేయాలని, అలానే వాళ్ల అక్క కొడుక్కి ఐఐటి లో సీటు రావాలని కోరుకుంటూ చీటీ రాసి మేడారం హుండీలో వేసింది. నాలుగు రోజులుగా మేడారం హుండీ లెక్కింపు కార్యక్రమం హన్మకొండలో జరుగుతోంది. ఈ చిట్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.