ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బందికి శుక్రవారం సాయంత్రం డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కమల్లు ప్రజాభావన్ లో విందు ఏర్పాటు చేశారు. బడ్జెట్ నేపథ్యం లో అధికారులు, సిబ్బంది మానసిక ఒత్తిడికి గురి కాకుండా, సుహృద్భావ వాతావరణంలో పనిచేసుకోవాలన్న ఆలోచనతో విందు ఏర్పాటు చేశారు. బడ్జెట్ కు ముందు అధికారులు సిబ్బందికి ఆర్థిక శాఖా మంత్రి విందు ఏర్పాటు చేయడం గతం నుండి ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీ కొనసాగింపులో భాగంగా శుక్రవారం సిబ్బందికి మంత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భగా డిప్యూటీ సీఎం సిబ్బంది ప్రతి ఒక్కరిని దగ్గరికి వెళ్లి పలుకరించి, యోగ క్షేమాలు తెలసుకుకున్నారు.