గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం నుండే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. గగన్ పహాడ్ లోని అప్పా చెరువు, మామిడి చెరువులోని అక్రమాలను కూల్చివేశారు. చెరువు FTL పరిధిలోని కట్టడాలను, ఆక్రమణలను తొలగించారు. 2021లో అక్రమంగా షెడ్లను నిర్మించారని గుర్తించిన అధికారులు వాటిని నేలమట్టం చేశారు.