Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. విచారణకు ఢిల్లీ రావాలని పిలుపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇదివరకే అరుణ్ పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నెల 10న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపింది. ఇదివరకే ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత సీబీఐ దర్యాప్తును ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆమె నివాసంలోనే విచారించారు. తాజాగా ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడంతో రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. ఈ లిక్కర్ స్కామ్‌లో కవితకు సంబంధించిన పలు వివరాలు కూడా వెల్లడించాడని సమాచారం. ఈ నేపథ్యంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. రామచంద్రపిళ్లై రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పిళ్లైను అరెస్ట్చే సిన ఈడీ, రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. పిళ్ళై కవితకు బినామీగా ఉన్నారన్న ఈడీ, పిళ్లై తాను కవిత ఆదేశాల మేరకే పని చేసినట్లు ఈడీకి తెలిపారు.

ఇండో స్పిరిట్ స్థాపనలో పిళ్ళై కీలకపాత్ర పోషించారని, మూడున్నర కోట్లు పెట్టుబడి పెట్టినట్లుగా పేపర్లపై పిళ్ళై చూపారని ఈడీ తెలిపింది. దానికి ప్రతిఫలంగా కవిత ఆదేశాలతో అరుణ్ రామచంద్ర పిళ్ళైకు కోటి రూపాయలు ఇచ్చినట్లు రిపోర్టులో తెలిపింది. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ కల్పించాలని ఈనెల 10న తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఎమ్మెల్సీ కవిత ధర్నాకు పిలుపునిచ్చారు. దానికి ఒకరోజు ముందుగానే 10వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

Topics

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...

దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ కోకాపేటలో దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) కురుమ భవనాన్ని ముఖ్యమంత్రి...

వికారాబాద్ లో కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img