దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. శుక్రవారం ఉదయం పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాహనం డ్రైవర్ నిద్ర మత్తు వల్లే కారు లారీని ఢీకొని.. ఎడమ పక్కనున్న రోడ్డు మెటల్ బారియర్‌ను ఢీకొట్టడంతో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్‌ను పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.