ముగ్గురు పార్లమెంట్ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఖమ్మం నుండి రామసహాయం రఘురామిరెడ్డి, కరీంనగర్ నుండి వెలిశాల రాజేందర్ రావు, హైదరాబాద్ నుండి MD వాసీదుల్లా సమీర్ల పేర్లను ప్రకటించారు. అలాగే, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కాంగ్రెస్ అధిష్టానం తీన్మార్ మల్లన్న పేరును ప్రకటించింది.
