పోయిన ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెడితే.. ఆరు నెలల్లో ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ, రుణమాఫీ వంటి కార్యక్రమాన్ని 12 రోజుల్లో పూర్తిచేసి నిబద్ధత చాటుకున్న డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ను, ఆయన అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం అభినందిస్తూ ప్రసంగించారు.
ఈ ఆరు నెలల్లో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క క్రమం తప్పకుండా పెన్షన్లు ఇస్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ చేసిండు, ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నాడు, రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేసిండు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందుబాటులోకి తెచ్చిండు, ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి అనుమతి ఇచ్చాడు. ఇన్ని చేసి ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖున 5వేల కోట్లు జీతాలు చెల్లిస్తున్నాడు. ప్రభుత్వంలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ప్రతినెల మొదటి తారీకున పెన్షన్లు చెల్లిస్తున్నారు. అంగన్వాడి నుంచి ఆశా వర్కర్ల వరకు ప్రతి నెల మొదటి వారంలో బకాయిలు లేకుండా చెల్లిస్తూ ఈ ప్రభుత్వంపై విశ్వాసం కలిగేట్లు చూసుకుంటున్నారు. ఇన్ని కార్యక్రమాలు ఆగకుండా చూసుకుంటూ ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పోయిన ఆయన చేసిన 43 వేల కోట్ల అప్పులు చెల్లించుకుంటూ .. ఈనాడు రైతుల కోసం రెండు విడతల్లో సరిగ్గా 12 రోజుల్లో 12.50 కోట్లు చెల్లించి నిబద్ధతను చాటుకున్నారు. ఈ సందర్భంగా వారిని, వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారందరి సహకారంతోనే ఏకకాలంలో రైతు రుణమాఫీ వంటి గొప్ప కార్యక్రమం పూర్తి చేయగలుగుతున్నాం అన్నారు.