Menu

  • Home
  • తెలంగాణ
  • ప్రజాపాలన దినోత్సవానికి హాజరవండి.. కేంద్రమంత్రులకు సీఎం లేఖలు
telangana cm revanth reddy delhi visit

ప్రజాపాలన దినోత్సవానికి హాజరవండి.. కేంద్రమంత్రులకు సీఎం లేఖలు

తెలంగాణ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఈ నెల 17వ తేదీన నిర్వ‌హించ‌నున్న తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్స‌వ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకావాలంటూ న‌లుగురు కేంద్ర మంత్రుల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌, కేంద్ర బొగ్గు,గ‌నుల శాఖ మంత్రి జి.కిష‌న్ రెడ్డి, కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌ కుమార్ ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం లేఖ‌లు పంపించారు. 1948, సెప్టెంబ‌రు 17న తెలంగాణ‌లో ప్ర‌జాస్వామిక పాల‌న శ‌కం ఆరంభ‌మైన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్స‌వం నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. హైద‌రాబాద్ నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్స్‌లో జ‌రిగే కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాల‌ని కేంద్ర మంత్రుల‌ను ముఖ్య‌మంత్రి కోరారు

Share the post

Also Read..