బీసీ కమీషన్ చైర్మెన్ నిరంజన్, సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారు. కులగణనపై వారితో సీఎం చర్చించారు. రాష్ట్రంలో బీసీ కులగణనకు అనుసరించాల్సిన విధి విధానాలపై కూడా చర్చలు జరిపారు. వెంటనే రాష్ట్రంలో కులగణనను ప్రారంభించి, తొందరగా పూర్తిచేయాలని వారికి సూచించారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని వారికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియను వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు బీసీ కమిషన్ను కోరారు. బీసీ కులగణన ప్రక్రియ వీలైనంత తొందరగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
— Telangana CMO (@TelanganaCMO) September 25, 2024
పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్… pic.twitter.com/dPnQSl3Da0