సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ భయం పట్టుకుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య విమర్శించారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రితో పాటుగా సింగారం, మురిపిరాలకు చెందిన 250 మంది బీఆర్ఎస్, బీజేపీ పార్టీకి చెందిన నాయకులు బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బల పుంజుకుంటుందని.. అది చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని విమర్శించారు.
అందులో బాగంగానే సీడబ్ల్యూసీ మీటింగ్ (CWC MEETING) నిర్వహణకు పరేడ్ గ్రౌండ్ ( Parede Ground) లో పర్మిషన్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టులను వాడుకొని గెలిచిన కేసీఆర్, ఇప్పుడు వారిని కాదని ఎంఐఎం పార్టీతో కలిసి వెళ్లడం ఆయన అవకాశవాద రాజకీయానికి నిదర్శనం అని విమర్శించారు. బీజేపీతో సఖ్యత కుదిరినందువల్లే కమ్యూనిస్టులను వదిలిపెట్టారని ఆయన ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు.
బీర్ల ఐలయ్య గారి సమక్షంలో సీఎం కెసిఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి నుండి మరియు ఆత్మకూరు మండలం సింగారం,మురిపిరాల గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు…@revanth_anumula @KomatireddyKVR @INCTelangana @priyankagandhi @INCIndia @RahulGandhi pic.twitter.com/4axvGN44CR
— Beerla Ilaiah (@IlaiahBeerla) September 6, 2023