Wednesday, March 26, 2025
HomeNewsTelanganaCM Breakfast Scheme Tealngana: సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం.. పాఠశాల విద్యార్థులకు అల్పాహారం

CM Breakfast Scheme Tealngana: సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం.. పాఠశాల విద్యార్థులకు అల్పాహారం

సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పహారం అందించే పథకాన్ని శుక్రవారం ఉదయం మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి లు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా, మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రావిర్యాల జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ఈ పథకం ప్రారంభం కావల్సి ఉన్నా.. కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. ఈ పథకం మంత్రుల చేతులమీదుగా అట్టహాసంగా ప్రారంభం అయింది.

IMG 20231006 WA0001

మానవీయ కోణంలో ఆలోచించి సీఎం కేసీఆర్ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చారని మంత్రి హరీష్ రావు కొనియాడారు. ఈ పథకం ద్వారా 20 లక్షల మంది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల తరుపున సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పిల్లలకు పౌష్ఠికాహారం అందించండం ఆనందంగా ఉందన్నారు.

IMG 20231006 WA0000

సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం విద్య వ్యవస్థలో సమూలమైన మార్పు తెస్తుందని తెలిపారు. ఇప్పుడు కేసీఅర్ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కేవలం విద్యార్థుల కడుపు నింపే కార్యక్రమం మాత్రమే కాదని స్కూల్స్ లో డ్రాప్ ఔట్స్ తగ్గించి, బడి బాట పట్టించి, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తెచ్చే పథకమని మంత్రులు తెలిపారు. 9, 10 తరగతుల విద్యార్థులకు దేశంలో తెలంగాణలోనే భోజనం అందిస్తున్నామన్నారు.

IMG 20231006 WA0004

ఆడపిల్లల కోసం ప్రత్యేక విద్యాలయాలు ప్రారంభించామని అన్నారు. ప్రస్తుతం బ్రేక్ ఫాస్ట్ పథకం దసరా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుందని మంత్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు పాటిల్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎడ్యుకేషన్‌, వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రావుల శ్రీధర్‌ రెడ్డి, విద్యా శాఖ సెక్రెటరీ వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు.

IMG 20231006 WA0003

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments