స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలి: సీఎస్ శాంతి కుమారి

స్వతంత్ర భారత జేవజ్రోత్సవ వేడుకల ముగింపు ఉత్సవాల నిర్వహణపై సి.ఎస్. శాంతి కుమారి సెక్రెటేరియెట్ లో ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తో పాటు పీసీసీఎఫ్ దొబ్రియల్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, హ్యాండ్లూమ్స్ శాఖ కమీషనర్ బుద్ధ ప్రకాష్, సమాచార శాఖ ప్రత్యేక కార్యదర్శి అశోక్ రెడ్డి, పంచాయితీ రాజ్ కమీషనర్ హనుమంత రావు, ఆయుష్ శాఖ కమీషనర్ హరి చందన, సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

b0cf3ea7 38be 4f36 9de4 9c140bfdd786

ఈ సందర్బంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ.. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను అత్యంత ఘనముగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ ముగింపు వేడుకల్లో ప్రజాప్రతినిధులు, యువజనులు, విద్యార్థులు, విభిన్న రంగాలకు చెందిన ప్రజలను భాగస్వామ్యం చేయనున్నట్టు ఆమె వెల్లడించారు. ఈ ముగింపు వేడుకల తేదీలను రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో ఖరారు చేస్తారని అన్నారు. ప్రధానంగా, భారత వజ్రోత్సవ ప్లాంటేషన్ పేరుతొ ఒక కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దారించారని, ఒక కోటి పదిహేను లక్షల జాతీయ జండాలను పంపిణీ చేయడంతోపాటు రాష్ట్రంలోని అన్ని సినిమాహాళ్లలో గాంధీ చలన చిత్రాన్ని ప్రదర్శించనున్నామని వివరించారు. ఈ ముగింపు వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రిక కట్టడాలను, జంక్షన్లను విధ్యుత్ దీపాలతో అలకంకరించనున్నామని తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల విషయంపై రాష్ట్రంలోని విద్యాసంస్థ లలో వ్యాసరచన, ఉపన్యాస, పెయింటింగ్ తదితర కాంపిటీషన్లను నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే 5 కె, 2 కె రన్ లను చేపడతామని అన్నారు. భారత స్వతంత్ర స్ఫూర్తిని తెలియచేసే విధంగా అన్నిపాఠశాలల్లో స్వతంత్ర భేరిని నిర్వహించడంతో పాటు స్వాత్రంత్ర పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమమాన్నితెలియచేసే ఫోటో ప్రదర్శనను హైదరాబాద్ లో నిర్వహిస్తామని వివరించారు. అయితే, ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబందించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రి ఖరారు చేస్తారని సిఎస్ శాంతి కుమారి స్పష్టం చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

Topics

ఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన గిరిజన విద్యార్థి

మృత్యువే గెలిచింది.. దాదాపు 20 రోజులకుపైగా నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

RGV: రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్దం! హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం...

పండుగ వాతావరణంలో ప్రజాపాలన విజయోత్సవాలు

డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img