భారత స్వాతంత్ర దినోత్సవం సంధర్భంగా డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, ముఖ్య కార్యదర్శులు జితేందర్, ఎస్.ఏ.ఎం. రిజ్వి, బుర్ర వెంకటేశం, కార్యదర్శులు శేషాద్రి, రాహుల్ బొజ్జా, టీ.కె. శ్రీదేవి, వాకాటి కరుణ, రఘునందన్ రావు, బుద్ధా ప్రకాష్, అనీల్ కుమార్ భారతి హోలికేరి, సుదర్శన్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.