ఇటీవల (ఎప్రిల్ 26న) హైదరాబాద్ శివారులోని ఓ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఆరుగురి ప్రాణాలను కాపాడిన 15ఏళ్ల బాలుడు సాయిచరణ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. సాయిచరణ్ ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు. సాయిచరణ్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ. అగ్నిప్రమాదం నుండి ఆరుగురి ప్రాణాలు కాపాడిన సాయిచరణ్ సాహసాన్నిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.